రాష్ట్రంలో వ్యవసాయ, పశు వైద్య, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నాలుగు రోజులపాటు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఈ కౌన్సెలింగ్ సాగుతుంది. తాజాగా కౌన్సెలింగ్‌కు పిలిచిన అభ్యర్థుల ర్యాంకుల వివరాలు, ఇతర సంబంధిత పూర్తి సమాచారం వర్సిటీ వెబ్‌సైట్ www.pjtsau.edu.in లో చూడొచ్చని రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ వెల్లడించారు.
అనివార్య కారణాలతో మొదటి విడత కౌన్సెలింగ్‌కు రాకుండా ఉన్న అభ్యర్థులూ ఈ విడత కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చని ప్రకటించారు. రిజర్వేషన్ నిబంధనలకు లోబడి బీఎస్సీ డిగ్రీ సీట్ల భర్తీ ప్రక్రియ సాగుతుందని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కాలుష్య రహిత భోగి.. ఓ గ్రామస్థుల వినూత్న ఆలోచన