ఆత్మహత్య చేసుకున్న దంపతులు కర్నూల్ జిల్లా నందికొట్కూరులో నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వీరాంజనేయులు (35), వసంత (32) రామలక్ష్మి(7) రాజేష్ (5) రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడాన్ని గమనించిన స్థానికులుఅనుమానంతో కిటికీ తీసి చూస్తే... కుటుంబమంతా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేసుకున్న సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ ఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకునిమృతదేహాలను శవపంచనామాకుతరలించారు.
ఆర్థిక కారణాలా... కుటుంబ కలహాలా...?
ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆత్మహత్యకు ఆర్థికపరమైన కారణాలేమైనాఉన్నాయా? లేక కుటుంబ కలహాలా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి :మావోయిస్టు కరపత్రాల కలకలం