ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ ఇవ్వాలని సుప్రీంలో పిల్​ దాఖాలు

కొవిడ్​-19 వైరస్​ పెరుగుతోన్న క్రమంలోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి పీపీఈ కిట్లు, మాస్క్​లు, హజ్మత్ సూట్​లు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది.

Pill filed in Supreme Court to protect sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ ఇవ్వాలని సుప్రీంలో పిల్​ దాఖాలు
author img

By

Published : Apr 10, 2020, 2:07 AM IST

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దిల్లీ సఫాయి కర్మాచారీస్ కమిషన్ మాజీ ఛైర్మన్, న్యాయవాది హర్మన్​సింగ్ సుప్రీంలో పిల్​ వేశారు. కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్య కార్మికులు పనులు కొనసాగిస్తున్నందున... వారికి పీపీఈ కిట్లు, మాస్క్​లు, హజ్మత్ సూట్​లు ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు. విధుల నిర్వహణ సమయంలో రక్షణ ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి 24 గంటల్లో సామాగ్రి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు.

పారిశుద్ధ్య కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా 48 గంటల్లో కరోనా పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కార్మికులు విధులు నిర్వహించేప్పుడు పీపీఈ కిట్లు, మాస్కులు వాడాలని డబ్ల్యూహెచ్​వో ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.