హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టును చేపట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జనవాహిని పార్టీ, జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ సంయుక్తంగా పిల్ దాఖలు చేశాయి. పైలట్ ప్రాజెక్టులో 1500 కోట్ల నుంచి 2వేల కోట్ల వరకు ఖర్చు చేయడం రాజ్యాంగంలోని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, తెరాస, కాంగ్రెస్, భాజపాతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యక్తిగతంగా పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చేపట్టిన దళితబంధు పైలట్ ప్రాజెక్టును సుమోటోగా స్వీకరించాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరగా.. సీజే హిమాకోహ్లి, విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ వేస్తే పరిశీలిస్తామని సూచించింది.
ఇదీ చదవండి: BJP HOARDING IN BHUVANAGIRI: 'ఎమ్మెల్యే సారూ.. రాజీనామా చెయ్'.!