రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో శిశు సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయడం లేదంటూ ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. చట్ట విరుద్ధంగా పాత కమిటీలనే విస్తరించి... కొనసాగిస్తున్నారని, జువైనల్ చట్టం ప్రకారం శిశువుల ప్రయోజనాలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం... నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
- ఇదీ చూడండి : నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్‌పై ముగిసిన విచారణ