భాగ్యనగరంలో భారీగా...
హైదరాబాద్ మహానగరంలో పావురాలు అధికంగా కనిపిస్తుంటాయి. జనాభా మాదిరిగానే భాగ్యనగరంలో పావురాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రధానంగా నాంపల్లి, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మోజాంజాహి మార్కెట్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, ట్యాంక్‌బండ్‌తో పాటు అపూర్వ కట్టడాలపైన ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి
ప్రాణాంతకం ఎలా అంటే...
పావురాలు ఎక్కడ పడితే అక్కడ వాలినప్పుడు వాటి కాళ్లకు, రెప్పలకు బ్యాక్టీరియాలు సోకుతుంటాయి. వాటిని చేతుల్లోకి తీసుకుని ఫీడింగ్ ఇస్తున్నప్పడు... రెప్పలు కొట్టినప్పుడు బ్యాక్టీరియాలు, రెప్పలకు ఉండే పేనులు మన శరీరంపై పడి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. చిన్న పిల్లలు, వృద్ధులకు వాటి వల్ల కొన్ని ప్రాణాంతక వ్యాధులు వెంటనే సోకుతాయి. ప్రధానంగా శ్వాసకోశ సంబంధింత వ్యాధులు సంభవిస్తాయి. జ్వరం, ఒంటి నొప్పులు సంభవించి ప్రాణాంతక వ్యాధులుగా మారతాయి.
నగరం నుంచి అడవుల్లోకి...
ఆహ్లాదాన్ని పంచే శాంతి కపోతాల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. సమస్యను గుర్తించిన అధికారులు పావురాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. మోజాంజాహి మార్కెట్‌తో పాటు ఇతర పర్యటక ప్రాంతాల్లోని 5 వందల పావురాలను వలల ద్వారా బంధించి శ్రీశైలం అడవుల్లో వదిలివేస్తున్నారు.
"ప్రేమకు చిహ్నంగా చేప్పుకునే పావురాల వల్ల వాటి ప్రేమించే వారికి ప్రమాదాలు పొంచి ఉన్న విషయాన్ని గమనించి.... తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు."
ఈ కథనం చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!