తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్లో 1500 రూపాయలు ఫోన్ పే యాప్ ద్వారా చెల్లిస్తే వారికి రెండు నెలల పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇవ్వనున్నట్లు ఫోన్ పే సంస్థ నిర్వాహకులు తెలిపారు. 'ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్' పేరుతో ఇండియన్ ఆయిల్ కంపెనీతో కలిసి హైదరాాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు.
డిజిటల్ లావాదేవీలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానే ఉపయోగపడతాయని ఫోన్‌పే నిర్వాహకులు పేర్కొన్నారు. ఐఫోన్‌తో ఫోన్ పే యాప్ మొదటిసారి వినియోగించే వారు 150 రూపాయల పెట్రోలు పోసుకుంటే 125 రూపాయల క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: ఇంజినీర్ని పిచ్చివాడిగా మార్చిన 'ప్రేమ'