ETV Bharat / state

డిజిటల్​ మనీ వద్దు.. నగదు కావాలంటున్న బెజవాడ పెట్రోల్​ బంకు డీలర్లు

Petrol Bunks conditions in Vijayawada: నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో నగదు రహిత లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. కానీ విజయవాడలోని పలు పెట్రోల్‌ బంకుల్లో డెబిట్‌ కార్డులు అంగీకరించబడవు అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆన్​లైన్​ చెల్లింపులతో, మర్చంట్​ ఛార్జీల కింద తమ కమీషన్లకు గండి పడుతుందని డీలర్లు అంటున్నారు.

Petrol Bunks
Petrol Bunks
author img

By

Published : Dec 21, 2022, 8:08 PM IST

Petrol Bunks conditions in Vijayawada: నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో నగదు రహిత లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ప్రజలు నగదు రహిత చెల్లింపులు ఎక్కువగా చేయాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరు డిజిటల్ చెల్లింపులకే మెగ్గు చూపుతున్నారు. కానీ విజయవాడలోని పలు పెట్రోల్‌ బంకుల్లో డెబిట్‌ కార్డులు అంగీకరించబడవు అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలను నిలిపివేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఒకలీటరు పెట్రోల్‌పై, బంకు నిర్వాహకులకు కమిషన్‌ కింద రూ.3.20, డీజిల్‌పై రూ.2.10 మాత్రమే వస్తుందని పెట్రోల్ డీలర్ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. దీనిలోనే విద్యుత్తు ఛార్జీలు, అద్దెలు, సిబ్బంది జీతభత్యాలు అన్నీ ఖర్చులు ఉంటాయని చెప్పారు. ఈ కమిషన్‌లో కార్డులు వినియోగించడం ద్వారా 100 రూపాయల వినియోగానికి రుపాయిన్నర నుంచి రెండు రూపాయల వరకు మర్చంట్‌ ఛార్జీలు చెల్లిస్తే ఇక మిగిలేదేమీ ఉండదని వివరించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 350 వరకు బంకులు ఉన్నాయని, ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీసీ, రిలయన్స్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. రోజుకు పెట్రోలు 1500 కిలో లీటర్లు, డీజిల్‌ 2,500 కిలో లీటర్లు వినియోగం అవుతుందన్నారు. పెట్రోలు రూ.111.66, డీజిల్‌ రూ.99.43 వరకు ధర ఉందన్నారు. రోజూ కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఎక్కువ శాతం డిజిటల్‌ చెల్లింపులే ఉంటాయి. కనీసం 50 శాతం నగదు ఉన్నా.. మిగతా 50శాతం డిజిటల్‌ చెల్లింపులు అంగీకరిస్తామని బంకు యజమానులు చెబుతున్నారు. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం వంటి వాటిని అనుమతిస్తున్నారు.

ఇండియన్ అయిల్ కంపెనీ వారు, తమ డీలర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నగదు చెల్లింపుల పరికరాన్ని అందించారని, ఆ పరికరంలో దాదాపు నాలుగైదు దశల్లో వినియోగదారుల వివరాలు పొందుపరిస్తే తప్ప, నగదు చెల్లింపులు జరగడం లేదని డీలర్లు వాపోతున్నారు. ఒక్క డిజిటల్ చెల్లింపుకే దాదాపు 5 నిమిషాల సమయం పడుతుందన్నారు. దీని వల్ల సమయం వృధా అవుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని డీలర్లు అంటున్నారు.

నగదు కావాలంటున్న బెజవాడ పెట్రోల్​ బంకు డీలర్లు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.