ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలపై అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైయ్యింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే డిజిటల్ మీటర్లలో తప్పులున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టులో అభ్యర్థి రాజేందర్ దాఖలు చేశాడు. మీటర్ కొలతల వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దీనిపై కౌంటర్ వేయాలని ప్రభుత్వం, పోలీస్ నియామక మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలపై విచారణను జనవరి 3కు కోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: