పరిపాలన వికేంద్రీకరణ- మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను ఏపీ రాష్ట్ర శాసనసభ మెున్నటి సమావేశాల్లో ఆమోదించింది. గతంలోనూ ఈ బిల్లులను శాసనసభ ఆమోదించినా, మండలి వ్యతిరేకించింది. వాటిని సెలెక్ట్ కమిటీలకు పంపాలని కోరింది. నాటి గందరగోళం మధ్యే బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రకటించారు. ఇది కోర్టుకు కూడా వెళ్లింది.
ఈ నేపథ్యంలో.. మళ్లీ అవే బిల్లుల్ని యథాతథంగా శాసనసభలో ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కర్నల్ భార్య సంతోషి