అరబ్ దేశాల్లో ఉండే ప్రత్యేకమైన మార్జాలం.. రాజమహేంద్రవరంలో సందడి చేస్తోంది. స్నోఫీ పేరు గల ఈ పిల్లిని.. స్థానిక గోకవరం బస్టాండు ప్రాంతానికి చెందిన సయ్యద్ మున్నీసా కుటుంబం పెంచుకుంటోంది.
స్నోఫీ ఆహారం కోసం నెలకు రూ.1500 ఖర్చు చేస్తున్నట్లు ఆ కుటుంబీకులు తెలిపారు. కారం తక్కువగా వేసిన చికెన్ తింటుందని.. పాలు మాత్రం తాగదని తెలిపారు. మామూలు పిల్లులతో పోలిస్తే ఇది ఆకారంలో భారీగా ఉంది. 5 కిలోలకు పైగా బరువు ఉండి.. ఒంటి నిండా జూలుతో ఆకట్టుకుంది. అలాగే.. బొమ్మలతో ఆడుకుంటూ చిన్న పిల్లల్లా ముచ్చట చేస్తుంటుంది.
ఇదీ చదవండి: దుర్గం చెరువు తీగల వంతెనపై తొలిసారిగా 10కె, 5కె రన్