దసరాకు ఏపీకి వచ్చేందుకు.. పంచలింగాల, గరికపాడు చెక్‌పోస్టు వద్ద బస్సులు అందుబాటులో ఉంచామని.. వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టు వద్ద ఏపీ బస్సులు ఉంటాయని పేర్ని నాని స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల వద్ద విరివిగా బస్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. సరిహద్దు నుంచి గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు ఉంటాయన్నారు.
కర్ణాటక, తమిళనాడుకు బస్సుల పునరుద్ధరణ జరిగింది. జూన్ 18 నుంచి తెలంగాణతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారు. కనీసం పండగ వరకైనా బస్సులు నడపాలని తెలంగాణ అధికారులను కోరాం. మూడ్రోజులు సెలవులు కావడంతో నిర్ణయంలో జాప్యమైంది. మంగళవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించే అవకాశం. తెలంగాణ ఆర్టీసీతో చర్చలు జరిపాక తుది నిర్ణయం తీసుకుంటాం. ఆర్టీసీ లాభనష్టాలు చూడట్లేదు... ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. - పేర్ని నాని, రవాణాశాఖ మంత్రి
అడ్డగోలుగా నడిపితే.. జరిమానాలే..
'ట్రాఫిక్ నిబంధనల చట్టంలో కేంద్రం 31 సెక్షన్లు మార్పు చేసింది. ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఒక వ్యక్తి నిర్లక్ష్యానికి ఇతరులు బాధ్యులు కావాలా?. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం తప్పు కాదు కదా?. అడ్డగోలుగా వాహనాలు నడిపినవారిపైనే జరిమానాలు ఉంటాయి.' అని పేర్ని నాని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులకు మార్గం సుగమం