హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజి నీరు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. కమాన్ వద్ద 10 రోజులుగా మురుగు నీరు రోడ్డుపైకి వస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మురుగునీటి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
మురుగు నీరు రోడ్డుపైకి వస్తుండటం వల్ల వ్యాపారులు, చేపల అమ్మకందారులు, పళ్ల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి భూగర్భ డ్రైనేజికి మరమ్మతులు నిర్వహించాలని, మురుగు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!