pension will be increased in ap జనవరి నుంచి పింఛను పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో విడత వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘మాది మహిళల ప్రభుత్వం. మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. అమ్మఒడి ద్వారా అక్కాచెల్లెళ్లకు తోడుగా నిలబడ్డాం. ఈ మూడేళ్లలో మహిళలకు ₹లక్షా 17వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు లేవు.. మధ్యవర్తులు లేరు.. వివక్ష లేదు. వచ్చే జనవరి నుంచి పింఛను ₹2,750కు పెంచుతున్నాం. గత ప్రభుత్వాలకు, మాకు తేడా గమనించాలని ప్రజలను కోరుతున్నాను’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: