ETV Bharat / state

‘పాదచారి.. వంతెన’ ఎక్కేదెప్పుడో! - పాదచారి వంతెనల వార్తలు

రాజధానిలో పాదచారులు అనేకమంది రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొనడంతో చనిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పాదచారుల వంతెలను నిర్మించే బాధ్యతను తలకెత్తుకున్న హెచ్‌ఎండీఏ వీటి నిర్మాణంలో వైఫల్యం చెందింది. హెచ్‌ఎండీఏ పలు ప్రాంతాల్లో పాదచారుల వంతెన (ఎఫ్‌వోబీ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రెండేళ్ల కిందట 5 చోట్ల పనుల్ని పట్టాలెక్కించింది. ఒక్కచోట కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఇంకా కొనసా...గుతూనే ఉన్నాయి. 2 చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే 3 చోట్ల పనులు మందగించాయి.

pedestrian-bridges-are-incomplete-in-hyderabad
‘పాదచారి.. వంతెన’ ఎక్కేదెప్పుడో!
author img

By

Published : Jan 3, 2021, 7:41 AM IST

2018 జనవరిలో.. నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో రూ.100 కోట్లతో 44 చోట్ల ఎఫ్‌వోబీలను అందుబాటులోకి తేవాలని మంత్రి కేటీఆర్‌ నిర్ణయించి బాధ్యతను బల్దియాకు అప్పగించారు. గుత్తేదారులు ముందుకు రాకపోవడం, నిధులు లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ చేతులెత్తేయడంతో 2018 జనవరిలో పనులను హెచ్‌ఎండీఏకు అప్పగించారు. సిబ్బంది కొరత అంటూ హెచ్‌ఎండీఏ కూడా తమవల్ల కాదంది. అయితే అప్పటికే డీపీఆర్‌ సిద్ధమైన ఉప్పల్‌, డా.ఏఎస్‌రావునగర్‌, వనస్థలిపురం, నెక్లెస్‌రోడ్డు, ఐడీపీఎల్‌లో పనులు మాత్రం చేపడతామంది.

నెక్లెస్‌రోడ్డులో..

హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖల సమన్వయలోపం శాపంగా మారింది. పీపుల్స్‌ ప్లాజాకు సమీపంలో రూ.1.77 కోట్లతో (స్పాన్‌ 35.9 మీటర్లు) నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించి 2018లో టెండర్లను ఆహ్వానించారు. గుత్తేదారును ఎంపిక చేశారు. పనులు మొదలయ్యాయో లేదో స్థానికులు ఆ స్థలం తమదేనంటూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ)కి ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇదే అంశంపై నివేదికివ్వాలని హెచ్‌ఎండీఏ రెవెన్యూ అధికారులను కోరింది. ఆ పత్రాలను సమర్పించి స్టే ఎత్తేయాలంటూ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావించారు. అయితే రెవెన్యూ శాఖ స్పందించక పోవడంతో ఏడాదిన్నరగా పనులు ఆగాయి.

వనస్థలిపురంలో..

ఆర్‌అండ్‌బీ, హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయలోపంతో కనీసం ఒక్క అడుగు కూడా పడలేదు. అత్యంత రద్దీగా ఉండే పనామా గోదాం దగ్గర రూ.2.73 కోట్లతో (స్పాన్‌ 60 మీటర్లు) ఎఫ్‌వోబీ నిర్మాణానికి డీపీఆర్‌ను సిద్ధం చేసి టెండర్లను కూడా ఆహ్వానించారు. ప్రతిపాదిత స్థలంలో ఎలక్ట్రికల్‌ కేబుల్స్‌, విద్యుత్‌ స్తంభాలు, ఇతరత్రాలను పక్కకు మార్చాల్సి ఉంది. ఇందుకోసం అనుమతివ్వాలని, మార్చేందుకు అవసరమైన ఖర్చును భరిస్తామంటూ ఆర్‌అండ్‌బీని హెచ్‌ఎండీఏ కోరింది. ఇప్పటికీ అనుమతులు రాకపోవడంతో పనులు మొదలవ్వలేదు.

ఐడీపీఎల్‌లో..

ఐడీపీఎల్‌ బస్టాండ్‌ దగ్గర రూ.1.58 కోట్లతో ఎఫ్‌వోబీ (31.3 మీటర్లు)ని అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. విద్యుత్‌ స్తంభాల తొలగింపులో తీవ్ర జాప్యం జరగడంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. 60 శాతం వరకు పూర్తయినా లిఫ్ట్‌, ఇతరత్రా పనులు కావాల్సి ఉంది. వచ్చే మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌ మొదటివారంలో అందుబాటులోకి తెస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.

ఉప్పల్‌, డా.ఏఎస్‌రావు నగర్‌లో..

మిగిలిన చోట్ల పరిస్థితి ఒకలా ఉంటే ఉప్పల్‌, డా.ఏఎస్‌రావునగర్‌లో మరోలా ఉంది. ఐడీఏ ఉప్పల్‌లో రూ.1.53 కోట్లు (స్పాన్‌ 30 మీటర్లు), డా.ఏఎస్‌రావునగర్‌లో రూ.1.54 కోట్ల (స్పాన్‌ 30.2 మీటర్లు)తో పనులు చేపట్టారు. టైల్స్‌, ఇతరత్రా చిన్నచిన్న పనులు జరగాల్సి ఉంది. అధికారులు దృష్టి సారిస్తే వారం, పదిరోజుల్లో ఈ రెండూ అందుబాటులోకి తేవచ్చు.

ఇదీ చూడండి: ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ రసవత్తరంగా పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.