ETV Bharat / state

PEC Meeting For MLA Candidate Selection : నేడు పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం.. ఎమ్మెల్యే టికెట్ల ఆశావాహుల వడబోత ప్రక్రియ షురూ - టీఎస్​ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపిక

PEC Meeting For MLA Candidate Selection : తెలంగాణ కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఆదివారం రెండోసారి సమావేశం కానుంది. ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వెయ్యి మందికి పైగా ఆశావహులను వడబోత పోసే కార్యక్రమం జరగనుంది. గత సమావేశంలో పూర్తి వివరాలు అందుబాటులో లేవని ప్రక్రియను వాయిదా వేసిన పీఈసీ.. ఒకే పేరు వచ్చిన స్థానాలతో పాటు ఎక్కువ మంది పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఉండేలా తదుపరి జాబితా సిద్ధం చేయనున్నారు.

PEC Meeting
PEC Meeting For MLA Candidate Selection
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 7:15 AM IST

PEC Meeting For MLA Candidate Selection నేడు పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం.. ఎమ్మెల్యే టికెట్ల ఆశావాహుల వడబోత ప్రక్రియ షురూ

PEC Meeting For MLA Candidate Selection : గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Reventh Reddy) అధ్యక్షతన "ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ'' సమావేశం కానుంది. ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వెయ్యికిపైగా ఆశావాహుల వడపోత జరగనుంది. మొదటి పీఈసీ సమావేశంలోనే ఈ ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ... దరఖాస్తుదారుల వివరాలు అందుబాటులో లేక వాయిదా వేశారు. ప్రస్తుతం దరఖాస్తుదారుల సంక్షిప్త సమాచారంతో పీఈసీ బుక్‌లెట్‌ను సిద్ధం చేసింది.

అభ్యర్థులను కుదించి జాబితా: 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చిన వెయ్యి 6 దరఖాస్తుదారుల వివరాలతో నివేదిక రూపొందించింది. దరఖాస్తుదారుడి పేరు? ఎప్పటి నుంచి పార్టీలో ఉంటున్నారు? ఏ హోదాలో ఉన్నారు? పుట్టిన తేదీ, కులం, ఉప కులాలు వివిధ రకాల సమాచారంతో కూడిన 500పేజీల ఈ బుక్‌లెట్‌ను పీఈసీ సభ్యులకు అందజేస్తారు. ఈ వివరాల ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి రెండు, లేక మూడు పేర్లు సూచిస్తూ.. వెయ్యి మంది నుంచి రెండుమూడు వందల మందికి కుదించి జాబితా సిద్ధం చేయనున్నారు.

Congress on Assembly Sessions 2023 : అసెంబ్లీలో బీఆర్ఎస్​ను నిలదీసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న కాంగ్రెస్

PEC Selection of MLA Candidates for TS Elections : పీఈసీ ఛైర్మన్ రేవంత్‌రెడ్డితోపాటు సభ్యులు, 26 మంది అనుబంధ విభాగాల నుంచి ముగ్గురు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే, ముగ్గురు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు 33 మంది సమావేశంలో పాల్గొంటారు. ఇందులో కనీసం 15 మంది ఆమోదముద్రవేస్తే ఆశావహుల జాబితా నుంచి పీఈసీ తదుపరి జాబితాలో పేరు వెళ్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇందులో సింగిల్‌ నేమ్‌ ఉండే నియోజక వర్గాలతోపాటు ఇద్దరు లేక ముగ్గురు ఆశావహులు ఉండే నియోజకవర్గాలు ఉంటాయని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగే సమావేశంలో తయారు చేయనున్న జాబితాను 4న జరగనున్న స్క్రీనింగ్‌ కమిటీకి అందచేస్తారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌తోపాటు ఇద్దరు సభ్యులు.. మొదట ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సభ్యులు, ముఖ్యనాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యే అవకాశం ఉంది. తర్వాత డీసీసీ అధ్యక్షులతోనూ సమావేశమై రాష్ట్రంలో, నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులను, అక్కడ పార్టీ బలాబలాలను కూడా అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది.

తుది ఎంపిక వారిదే: ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఇచ్చే పేర్ల జాబితాను నిశితంగా పరిశీలించి అందులో వడబోత పోసి.. దాదాపు ప్రతి నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు పేర్లతో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీలు కార్యదర్శులు, సీనియర్‌ నాయకులు పోటీ చేయనున్న వివాదరహిత నియోజకవర్గాల్లో.. సింగిల్‌ నేమ్‌తో ఉండే 40కి పైగా నియోజక వర్గాల అభ్యర్థులను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్థాయిలోనే ఎంపిక అవుతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల దరఖాస్తులను మరింత లోతైన అధ్యయనం చేసి ఎంపిక చేస్తారని పేర్కొంటున్నాయి. సర్వేలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులు స్థానిక సమీకరణాలు ఇలా అన్ని కోణాల్లో పరిశీలన చేసి లాబీయింగ్‌కు తావు లేకుండా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నేతలు చెబుతున్నారు.

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

T Congress Assembly Elections 2023 Plan : MLAగా పోటీ చేయాలనుందా​? కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. అప్లై చేసేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.