పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను... మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా వాడలేదని... ఆయన కెమెరా వాడినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? అని పోలీసులను ఆయన ప్రశ్నించారు.
111 జీవో పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ కట్టారని... దాన్ని వేలెత్తి చూపితే జైల్లో వేస్తారా? అని నిలదీశారు. అక్కడ చిన్నచిన్న గుడిసెలు వేసుకుంటేనే రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కూల్చి వేస్తుందని తెలిపారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవో 111ని సవరించాలని... లేదంటే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు