ఇతర పార్టీలకు చెందిన నాయకులను దొంగలు, దేశద్రోహులు అని విమర్శించే భాజపా... ఇప్పుడు వారినే తమ పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్. భాజపాలోకి రాగానే వారంతా పునీతులు అవుతున్నారా అని నిలదీశారు. కమలం పార్టీలో సమర్థవంతమైన నాయకులు లేరా? అని ప్రశ్నించారు. ఇన్నిరోజులు చెమటోడ్చి కష్టపడి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి వేరే నాయకులను తీసుకొచ్చి అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి భాజపాలో చేరిన డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో ఇప్పటివరకు నిరుద్యోగ సమస్య పరిష్కరించలేదని, అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్న పార్టీ పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి భారత నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు