కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అనిత అమర్నాథ్ గౌడ్ తరఫున ఉత్తమ్ ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
తెరాసకు ఓటు అడిగే హక్కు లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. వరదల సమయంలో సీఎం కేసీఆర్ ఏం చేశారన్నారు. హైదరాబాద్ నగరానికి భాజపా ఏం చేసిందని నిలదీశారు. ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మత రాజకీయాలు చేస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి : 30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి: రేవంత్ రెడ్డి