అవినీతికి మారుపేరు తెరాస అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వరద సాయం కోసం వందల కోట్లు ఖర్చు చేశామంటున్నారని... రూ.5 కోట్లు మాత్రమే ప్రజలకు చేరుంటాయని ఆరోపించారు. వరద సాయం పేరుతో తెరాస నేతలు దోచుకున్నారన్నారు. భారీ వర్షాలకు వందల మంది మరణిస్తే బాధిత కుటుంబాలను పరామర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌మెంట్ రీజియన్ రద్దయితే స్థానిక భాజపా నోరు మెదపలేదు. పార్లమెంట్‌లో అన్ని విషయాల్లో భాజపాకు తెరాస మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా భాజపాకు మద్దతు పలికేందుకు ఎంఐఎం రాజకీయాలు చేస్తోంది.
- ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్
ఇదీ చదవండి : సీఎం కేసీఆర్తో సినీరంగ ప్రముఖుల సమావేశం