ETV Bharat / state

Revanth Reddy: 'కాస్కో ఈటల.. రేపు గుడిలో ప్రమాణం చేసి చూపిస్తా' - Revanth Reddy responded to Etala Rajender comments

Revanth Reddy reaction to Etala Rajender comments: మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన​ ఆరోపణలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి స్పందించారు. ఆ ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్​ కార్యకర్తల నుంచి సమకూర్చిందేనని స్పష్టం చేశారు.

PCC president Revanth Reddy
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
author img

By

Published : Apr 21, 2023, 7:28 PM IST

Updated : Apr 21, 2023, 8:13 PM IST

Revanth Reddy reaction to Etala Rajender comments: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​ నుంచి తాను డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్​ పార్టీదేనని తెలిపారు. సాయం అందించిన వారిలో ఎక్కువగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారని పేర్కొన్నారు. ఈటల దిగజారి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నారని అన్నారు.

Revanth Reddy fires on Etala : ఏఐసీసీ కార్యదర్శులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కల సమక్షంలో పార్టీలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తల నుంచి తానే డబ్బు సేకరించానని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్​ఎస్ నుంచి డబ్బు వచ్చిందన్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. బీజేపీకి నమ్మకం లేకపోతే వారు విశ్వసించే భాగ్యలక్ష్మి అమ్మవారి గర్భ గుడిలో రేపు సాయంత్రం 6 గంటలకు వచ్చి ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి ఆలయంపై వారికి విశ్వాసం లేకపోతే ఏ ఆలయంలోకైనా వస్తానని.. తడి బట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పారు. తాను ప్రమాణం చేస్తానన్నది ఈటల రాజేందర్ కోసం కాదని.. తెలంగాణ భవిష్యత్ కోసమేనని అన్నారు.

"నేను బీఆర్​ఎస్ నుంచి కానీ, కెేసీఆర్ నుంచి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈటల దిగజారి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాను. పార్టీలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తల నుంచి.. ఏఐసీసీ కార్యదర్శులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కల సమక్షంలో నుంచి సమకూర్చాం. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి సమకూర్చినదే. సాయం అందించిన వారిలో ఎక్కువ బీసీలు , ఎస్సీలు, స్టీలు ఉన్నారు." - రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

అసలేం జరిగిదంటే: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు రేవంత్​ రెడ్డి, కేసీఆర్​ భారీ మొత్తంలో నగదు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్​కి బీఆర్​ఎస్​ రూ.25 కోట్లు ఇచ్చారని ఆక్షేపించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు. 2024 ఎన్నికల ముందు లేదా తరవాత కలవడం కచ్చితమని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.
ఇవీ చదవండి:

Last Updated : Apr 21, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.