Revanth Reddy on service charge on UPI payments: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-యూపీఐ చెల్లింపులపై ఛార్జ్ వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని యూపీఐ సర్క్యూలర్ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి ట్విటర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. పారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్‌లైన్ చెల్లింపులకు కేంద్రం అలవాటు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ చెల్లింపులపై 1.1 శాతం ఛార్జ్ వసూలు చేయడం మోదీ కుటిల నీతికి నిదర్శనమని ద్వజమెత్తారు.
-
పారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్ లైన్ చెల్లింపుల (UPI) వైపు మళ్లించి ఇప్పుడు ఆ చెల్లింపుల పై 1.1 శాతం ఛార్జ్ వసూలు చేయడం మోడీ కుటిల నీతికి నిదర్శనం.
— Revanth Reddy (@revanth_anumula) March 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
రూ.10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ పై 1.1 శాతం పన్ను అంటే ప్రజల పై రూ.11 వేల కోట్ల భారం ప్రతి ఏటా మోపబోతున్నారు.
మోడీ… pic.twitter.com/XJwVbwjasA
">పారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్ లైన్ చెల్లింపుల (UPI) వైపు మళ్లించి ఇప్పుడు ఆ చెల్లింపుల పై 1.1 శాతం ఛార్జ్ వసూలు చేయడం మోడీ కుటిల నీతికి నిదర్శనం.
— Revanth Reddy (@revanth_anumula) March 29, 2023
రూ.10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ పై 1.1 శాతం పన్ను అంటే ప్రజల పై రూ.11 వేల కోట్ల భారం ప్రతి ఏటా మోపబోతున్నారు.
మోడీ… pic.twitter.com/XJwVbwjasAపారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్ లైన్ చెల్లింపుల (UPI) వైపు మళ్లించి ఇప్పుడు ఆ చెల్లింపుల పై 1.1 శాతం ఛార్జ్ వసూలు చేయడం మోడీ కుటిల నీతికి నిదర్శనం.
— Revanth Reddy (@revanth_anumula) March 29, 2023
రూ.10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ పై 1.1 శాతం పన్ను అంటే ప్రజల పై రూ.11 వేల కోట్ల భారం ప్రతి ఏటా మోపబోతున్నారు.
మోడీ… pic.twitter.com/XJwVbwjasA
service charge on UPI payments : రూ.10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం పన్ను వసూలు చేయడం దారుణమని రేవంత్ ఆరోపించారు. వాటిపై 1.1 శాతం పన్ను వసూలు చేయడం ద్వారా రూ.11 వేల కోట్లు అదనంగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. మోదీ హఠావో - దేశ్ బచావో! అంటూ రేవంత్ రెడ్డి ట్విటర్‌లో ట్వీట్ చేశారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలన్న వార్తలు గతేడాది ఆగస్టులో జోరుగా వినిపించాయి. ఈ విషయమై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అధ్యయనం చేస్తోందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే అలాంటి ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2022 ఆగస్టులో స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
రూ.2000 కన్నా ఎక్కువ వసూలు చేస్తే.. 1.1 శాతం పన్ను: గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని భారత జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్పీసీఐ ప్రకటన విడుదల చేసింది. యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ఫేస్-యూపీఐ ద్వారా చేసే మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రీ పెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్- పీపీఐ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది. యూపీఐ ద్వారా రూ.2000 కన్నా ఎక్కువ మొత్తం బదిలీ చేస్తే.. చెల్లింపులు విలువలో 1.1 శాతం పన్నును విధించనున్నట్లు తెలిపింది. లావాదేవీ ఆమోదించడం, ప్రాసెస్ చేయడం, పూర్తి చేయడానికి సంబంధించిన ఖర్చుల దృష్ట్యా ఈ సర్వీస్ ఛార్జ్ విధిస్తున్నట్లు జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్పీసీఐ స్పష్టం చేసింది.
ఏ లావాదేవీలపై సర్వీస్ ఛార్జ్.. జాతీయ చెల్లింపుల సంస్థ ప్రకటన ప్రకారం.. రూ.2000 పైబడిన లావాదేవీలపై మాత్రమే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అది కూడా.. ప్రీపెయిడ్ వాలెట్స్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే. అంటే.. మీ బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉన్న యూపీఐ అకౌంట్ ద్వారా రూ.2000 కన్నా ఎక్కువ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా వాటికి ఎలాంటి ఛార్జీ ఉండదు. వాలెట్(పేటీఎం/ఫోన్‌పే వాలెట్ వంటివి) నుంచి ఇతరులకు రూ.2000 మించి నగదు బదిలీ చేస్తేనే.. 1.1 శాతం సర్వీస్ ఛార్జ్ వర్తిస్తుంది.
ఇవీ చదవండి: