ముఖ్యమంత్రి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి... ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వలేమంటున్న ప్రభుత్వం సచివాలయం కూల్చివేయడమేంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే కేసీఆర్ వైద్యంపైన సమీక్షలు కూడా చేయకుండా... ఎక్కడో చీకటిలో ఉన్నారంటూ విమర్శించారు. పాత సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేయమని కోరినా... మా మాటలు పెడచెవిన పెడుతూ... సీఎం తన మొండి వైఖరితో కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొనాలి... ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు.
ఇదీ చదవండి: ఎక్కువ సేపు కూర్చుంటే క్యాన్సర్ వస్తుందట..!