ETV Bharat / state

ఎస్​ఈసీ తప్పుల మీద తప్పులు చేస్తోంది: నిరంజన్​ - PCC Election Coordinating Committee Convener G. Niranjan latest news

రాష్ట్ర ఎన్నికల కమిషన్​పై పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్​ జి.నిరంజన్​ మండిపడ్డారు. ఎస్​ఈసీ తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 4న జరిగిన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా బ్యాలెట్‌ పేపర్లను గోడౌన్​లకు తరలించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

PCC Election Coordinating Committee Convener G. Niranjan fires on sec
ఎస్​ఈసీ తప్పుల మీద తప్పులు చేస్తోంది: నిరంజన్​
author img

By

Published : Dec 9, 2020, 5:50 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పుల మీద తప్పులు చేస్తోందని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ జి.నిరంజన్‌ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ గతంలోనూ అనేక తప్పిదాలు చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

ఈ నెల 4న గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత బ్యాలెట్‌ పేపర్లను అభ్యర్థులకు సమాచారం లేకుండా గోడౌన్​లకు తరలించారని నిరంజన్​ ఆరోపించారు. ఇది చాలా పెద్ద తప్పని మండిపడ్డారు. గోడౌన్​లకు తరలించే ముందు.. అభ్యర్థులకు సమాచారం ఇవ్వాల్సి ఉందన్న ఆయన.. గోడౌన్​లలో బ్యాలెట్ బాక్సులకు సీల్​ వేయాల్సి ఉంటుందని.. వాటిపై అభ్యర్థి నుంచి కానీ అభ్యర్థి సూచించిన వ్యక్తి నుంచి కానీ సంతకం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వీటన్నింటిని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఎస్​ఈసీ రాజకీయ పార్టీలకు ఏ రకంగా విశ్వాసం కల్పిస్తుందో తెలపాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: 'సిద్దిపేటలో మరో వెయ్యి ఇళ్ల కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.