ETV Bharat / state

భాజపా మేలు కోసమే ఎంఐఎం సోదరుల అనుచిత వ్యాఖ్యలు: ఉత్తమ్ - హైదరాబాద్ ఎన్నికలు

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ భాజపా, ఎంఐఎం దొంగ నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపాకు మేలు చేసేందుకే ఓవైసీ సోదరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్​ను గెలిపించాలంటూ బంజారాహిల్స్ డివిజన్​ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు.

PCC chief uttam kunar reddy fire in BJP, MIM in ghmc elections
భాజపా మేలు కోసమే ఎంఐఎం సోదరుల అనుచిత వ్యాఖ్యలు: ఉత్తమ్
author img

By

Published : Nov 26, 2020, 2:24 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపాకు సహకరించేందుకే ఓవైసీ సోదరులు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి విమర్శించారు. విషపూరిత ప్రచారం చేస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భాజపా, ఎంఐఎంలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలంటూ బంజారాహిల్స్​ అభ్యర్థి ధనరాజ్ రాఠోడ్​ తరపున మాజీ మంత్రి వినోద్​తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఓవైసీ సోదరులు వైఎస్​ రాజశేఖర్​రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భాజపాకు లాభం చేకుర్చేందుకే పశ్చిమబెంగాల్​లో ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారని అన్నారు.

ఇదీ చూడండి:'గెలవాల్సిందే.. పట్టు బిగించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.