తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఈ రంజాన్ పండుగ అత్యంత పవిత్రమైనదన్న ఆయన నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని పేర్కొన్నారు.
ప్రపంచ బాగు కోసం తపిస్తున్న సోదరులు రంజాన్ పండుగను సంప్రదాయబద్దంగా.. భక్తితో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్న సమయంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఉత్తమ్ ముస్లిం సోదరులకు సూచించారు.
ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు