పార్టీ అనుబంధ సంఘాలు శాయశక్తులా కృషి చేసి... మండలి పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల మండలి నియోజకవర్గ ఎన్నికలపై చర్చించారు.
భాజపా మతం పేరుతో లబ్ధి పొందాలని చూస్తోందని.. దేశానికి, రాష్ట్రానికి ఏమి చేయకపోగా.. డబ్బుల సంచులతో కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ.. తిరుగుతోందని ఆరోపించారు. తెరాస అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు దోచుకుని తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుందని వెల్లడించారు. చదువుకున్న నిరుద్యోగులు 19 లక్షల మంది ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అటు ఉద్యోగులను, ఇటు నిరుద్యోగులను తెరాస, భాజపాలు తీవ్రంగా మోసం చేశాయని ఆరోపించారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని.. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఓటర్లకు సూచించారు.
- ఇదీ చదవండి: భారత్ 'పవర్'పై డ్రాగన్ గురి!