హైదరాబాద్ బుద్ధభవన్‌లో రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవో బుద్ధప్రకాష్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కలిశారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్పప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి... పార్టీ మారుతున్నారంటూ సాగిన దుష్పప్రచారంపై అదనపు సీఈఓకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదొక కుట్ర అని.. ఈ తరహా చర్యల వల్ల పార్టీకి నష్టం కలిగిందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గెలవబోతున్నారన్న భయంతో మంత్రి హరీశ్ రావు, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు... ఇద్దరూ కలిసే ఈ కుట్ర, దుష్పప్రచారానికి తెరలేపారని ఆక్షేపించారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా... ఎన్నికల పోలింగ్ ముగిసేలోగా బాధ్యులను గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్నారు. అదనపు సీఈవోను కలిసిన వారిలో మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు.
ఇదీ చదవండి: ధరణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు