ETV Bharat / state

ఉపాధ్యాయుల సంఘాలను బెదిరిస్తున్నారు: ఉత్తమ్​

తెరాసకు ఓటు వేయాలని ఓటర్లను బెదిరించి.. ప్రమాణం చేయించుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. ప్రమాణాలు చేయిస్తున్న వీడియోలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

author img

By

Published : Mar 8, 2021, 7:53 PM IST

pcc chief uttam kumar reddy fire trs in hyderabad
ఉపాధ్యాయుల సంఘాలను బెదిరిస్తున్నారు: ఉత్తమ్​

ఎమ్మెల్సీ ఎన్నికలల్లో అధికార పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందని పీసీసీ అధ్యక్షుడు కుమార్ రెడ్డి విమర్శించారు. తెరాసకు ఓటు వేయాలని ఓటర్లను బెదిరించి.. ప్రమాణం చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రమాణాలు చేయిస్తున్న వీడియోలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై తక్షణం స్పందించాలని.. లేకుంటే ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీతో కుమ్మక్కైందని భావించాల్సి వస్తుందన్నారు.

ఉపాధ్యాయుల సంఘాలను మంత్రులు పిలిచి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలపై తాము పోరాడతామని చెప్పారు. ఏడేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు రాలేదో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్వొకేట్ దంపతులు వామన్​ రావు, నాగమణి హత్యలను కేసీఆర్ ఖండించలేదన్నారు.

జర్నలిస్టులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతి సందర్భంలోనూ విమర్శించిన కేసీఆర్.. శంకరమ్మను బలిచేసినట్లు పీవీ వాణీని కూడా బలిచేయాటానికే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని తెలిపారు.

ఇదీ చదవండి: ఫామ్‌హౌస్‌ను వదిలి ఎందుకు బయటికి రారు.?: బండి సంజయ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.