పోలీసుల తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరంగా ర్యాలీని అడ్డుకోవటం సరికాదన్నారు. గాంధీభవన్ వెలువలే ర్యాలీని అడ్డుకోవడంతో.. గాంధీభవన్‌లోనే 24 గంటల దీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా... పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై ఉత్తమ్ మండిపడ్డారు. సీపీ అంజనీ కుమార్... కేసీఆర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తమ పార్టీ కార్యాలయానికి వచ్చే కాంగ్రెస్ కార్యర్తలను అడ్డుకోవడానికి మీరేవరని డీజీపీ మహేందర్ రెడ్డిపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో దీక్ష పెట్టుకుంటే అరెస్టు చేస్తారా? అని నిలధీశారు. కార్యకర్తలను అరెస్టు చేయవద్దని నగర పోలీసు కమిషన్‌కు చెప్పాలని సూచించారు. ఈ మేరకు ఉత్తమ్ డీజీపీ, సీపీలతో ఫోన్‌లో మాట్లాడారు. నగరంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుమతిచ్చారని గుర్తు చేసిన ఉత్తమ్... తాము శాంతియుతంగా దీక్ష చేసుకున్నా అరెస్టు చేయడం ఇదేం పద్దతని మండిపడ్డారు.
ప్రపంచంలో 135ఏండ్ల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని.... కోట్లాదిమంది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉండడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని.... చరిత్రపై అవగాహన లేని నాయకులే దేశ విభజనకు కాంగ్రెస్ కారణం అని ప్రచారం తప్పుడు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు