ఎన్నికల వేళ తెరాస రైతులకు హామీ ఇచ్చిన విధంగా.. లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. లక్ష రూపాయలు మాఫీ చేయకుండా తొలుత 25వేలు చేయటం సరైంది కాదన్నారు. పండిన పంటలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం చెప్పారని... ఇప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు మాటలు మార్చుతున్నారని ఆరోపించారు.
నాలుగైదు రోజుల్లో విత్తనాలు విత్తే సమయంలో..ఏ పంట వేయాలో చెప్పటం సరైంది కాదని మండిపడ్డారు. పత్తి పంట విషయంలో గతంలో చెప్పిన మాటలకు.. విరుద్ధంగా ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు.
వానాకాలంలో మొక్కజొన్న వేయవద్దంటున్నారు... మొక్కజొన్న వేస్తే రైతుబంధు ఇవ్వబోము, కొనుగోలు చేయము అంటున్నారు. మొక్కజొన్న పంట వేసేదే వానాకాలం... మొక్కజొన్న పంటపై ఆంక్షలు పెడితే రైతుల తరఫున పోరాటం చేస్తాం.... ఉత్తమ్‌కుమార్, పీసీసీ చీఫ్.
ఇదీ చూడండి: ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన