హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయన్ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాట్లాడుకున్నారు. పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాలని ఉత్తమ్‌ను రేవంత్ ఆహ్వానించారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి పద్మ ఉన్నారు.
బిజీ బిజీగా..
పార్టీ సీనియర్ నేతల్ని కలిసే పనిలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా కలిసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా... భట్టి నిరాకరిస్తూ వచ్చారు. ఈరోజు ఉదయం పీసీసీ సీనియర్ ఉధ్యక్షుడు మల్లు రవితో చర్చల అనంతరం.. భట్టిని రేవంత్ కలిసి.. రేపటి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
మర్రికి, శ్రీధర్‌బాబుకు ఆహ్వానాలు...
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని రేవంత్ కలిశారు. అపారమైన అనుభవం, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి సలహాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రేవంత్ తెలిపారు. అనంతరం మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును కలుసుకున్నారు. రేపటి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాలని కోరారు.
ఒంటి గంట 30 నిమిషాలకు బాధ్యతల స్వీకరణ
రేపు మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ భవన్‌కు చేరుకుంటారు. బాధ్యతల స్వీకరణ అనంతరం బహిరంగ సభలో మాట్లాడాతారు.
ఇదీ చదవండి: Revanth Reddy : 'జోడెద్దుల్లా పనిచేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం'