ETV Bharat / state

రాష్ట్రంలో 8 ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం సాగుతోంది: రేవంత్‌రెడ్డి - రేవంత్​ రెడ్డి వార్తలు

Revanth reddy: తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్‌ బియ్యం స్కాం సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు దోచేశారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా ఏ స్థాయిలో దోచుకున్నారో అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు తెలియకుండా ఇది సాధ్యమా అని రేవంత్‌ ప్రశ్నించారు.

రాష్ట్రంలో 8 ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం సాగుతోంది: రేవంత్‌రెడ్డి

author img

By

Published : Apr 16, 2022, 3:24 PM IST

Revanth reddy: రాష్ట్రంలో 8 ఏళ్లుగా సీఎంఆర్​ బియ్యం కుంభకోణం సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు దోచేశారని ట్విటర్​ వేదికగా విమర్శించారు. ఒకే జిల్లాలో ఇంత కుంభకోణం జరిగితే... రాష్ట్రంలో ఇంకా ఏ స్థాయిలో దోచుకున్నారోనన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలియకుండా ఇది సాధ్యమా రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించకుండా భాజపాను ఎవరు ఆపుతున్నారని ఆయన ప్రశ్నించారు.

రేవంత్​ ట్వీట్​
రేవంత్​ ట్వీట్​

ఇటీవలే కేంద్రమంత్రికి రేవంత్ బహిరంగ​ లేఖ: ఈ విషయంపై ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి లేఖ కూడా రాశారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో మాయమైన బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తూ బహిరంగ లేఖ ద్వారా వివరించారు. "రాష్ట్రంలో ఏటా రూ. వందల కోట్ల విలువైన ధాన్యం కుంభకోణం జరుగుతోంది. మిల్లర్లతో కుమ్మక్కై కుంభకోణం చేస్తున్నారు. సీఎంఆర్ పేరుతో మిల్లుల్లో జరిగే అక్రమాలపై విచారణ జరపాలి. మిల్లుల్లో బియ్యం రీసైక్లింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులపై విచారణ జరపాలి. అక్రమ మిల్లులను సీజ్ చేసి దోపిడీ సొమ్ము వసూలు చేయాలి. కుంభకోణంలో భాగస్వామ్యమైన తెరాస నేతలపైనా చర్యలు తీసుకోవాలి. సీబీఐ విచారణ జరిపించి కిషన్‌రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి" ఇటీవల రాసిన లేఖలో రేవంత్​ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.