ETV Bharat / state

మహిళలు రాణించడానికి కాంగ్రెస్​ విధానాలే కారణం: ఉత్తమ్​ - uttam kumar reddy latest news

కాంగ్రెస్​లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

pcc chief, nalgonda mp uttam kumar reddy womens day wishes
మహిళలు రాణించడానికి కాంగ్రెస్​ విధానాలే కారణం: ఉత్తమ్​
author img

By

Published : Mar 8, 2021, 3:13 PM IST

దేశంలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్​ అని పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి అన్నారు. తెలంగాణ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్​లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ తమదేనన్నారు.

మహిళా సంఘాలు ఏర్పాటు చేసి.. వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చి.. వారిని వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు. నేడు అన్ని రంగాల్లోని మహిళలకు ప్రాధాన్యత దక్కుతుంది అంటే అందుకు హస్తం పార్టీ విధానాలే కారణమని తెలిపారు. దేశంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చట్టాలు చేసి కఠినంగా అమలు చేశామన్నారు. మహిళల చేతిలో దేశ భవిష్యత్ ఉందని పేర్కొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.... జనాభాలో సగం ఉన్న మహిళలు ఇంకా అన్ని రంగాల్లో సమానంగా అవకాశాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి: ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన సమానత్వం: కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.