ఆధునిక హంగులతో ఉస్మానియా ఆస్పత్రి భవనం నిర్మించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిని కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఆస్పత్రి వార్డుల్లో రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.
కొంచెం వర్షానికే వార్డుల్లోకి నీరు రావడం వల్ల రోగులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్ పనితీరుకు ఉస్మానియాలోకి నీళ్లే.. నిదర్శనమన్నారు. కేసీఆర్కు మాటలు ఎక్కువ.. ఆచరణ శూన్యమని అన్నారు. బాగున్న సచివాలయం కూల్చి కొత్త భవనాలు కడుతున్నారని విమర్శించారు. కేసుల సంఖ్య తక్కువగా చూపించేందుకే పరీక్షలు తక్కువ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ లేదని... కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలన్నారు. సచివాలయం నిర్మాణం ఆపేసి ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!