హుస్సేన్ సాగర్‌లో కాలుష్యం తగ్గుముఖం పడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) పరీక్షల్లో వెల్లడైంది. ఏప్రిల్‌లో హుస్సేన్ సాగర్ నుంచి నమూనాలను సేకరించి సనత్ నగర్‌లోని ప్రధాన ప్రయోగశాలలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. లీటర్ నీటిలో డీవో పరిమాణం 6 ఎంజీలు, బీవోడీ 20 ఎంజీలు, పీహెచ్ విలువ 7.7, టోటల్ కోలిఫాం 100 ఎంఎల్ నీటిలో 920 ఎంపీఎన్ ఉన్నట్లు తేలింది. ఇదే గణాంకాలు జనవరిలో డీవో 1 ఎంజీ, బీవోడీ 26 ఎంజీలు, పీహెచ్ 8.16, టోటల్ కోలిఫాం 1600 ఎంపీఎన్గా ఉన్నాయి.
మెరుగుపడిన నాణ్యత
ఈ ప్రకారం జనవరితో పోలిస్తే ఏప్రిల్‌లో నీటి నాణ్యత మెరుగుపడింది. మరింత సమగ్ర అధ్యయనం కోసం అయ్యే వ్యయాన్ని భరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని బల్క్‌డ్రగ్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్(ఇండియా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఈశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు