ETV Bharat / state

మాజీ మంత్రి అనుచరులు ఇకనైనా పద్ధతి మార్చుకోండి.. పవన్ కల్యాణ్ వార్నింగ్ - rayapati aruna latest news

Pawankalyan warns to Exminister followers: ఆడబిడ్డలను కించపరిచే విధంగా మాట్లడితే.. బలంగా సమాధానం ఇస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి అర్ధరాత్రి ఫోన్లు చేసి.. ఆసభ్యంగా మాట్లాడటం తగదన్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి అనుచరులు తమ పద్ధతి మార్చుకోవాలని.. లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

pawan
pawan
author img

By

Published : Jun 24, 2022, 9:17 PM IST

స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే.. గట్టిగా సమాధానం ఇస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి ఫోన్లు చేసి.. మర్యాదలకు భంగం వాటిల్లేలా ఆసభ్యకరంగా మాట్లాడటం తగదని ధ్వజమెత్తారు.

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలపగా... ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపాటి అరుణకు ఫోన్‌ చేసి.. ధైర్యంగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయన్నారు. రాజకీయాల్లో విధివిధానాలపై మాట్లాడుకుంటాం.. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.