Pawan Kalyan Election Campaign Schedule 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Pawan Kalyan Election Campaign in Telangana Today : ఈ నెల 25న తాండూరులో జనసేన(Janasena) అభ్యర్థి శంకర్ గౌడ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల్లోనూ హాజరు కానున్నారు. ఈ సభల్లో కూడా పవన్ మాట్లాడనున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది : పవన్ కల్యాణ్
Pawan Kalyan Election Campaign in Warangal Today : ఎన్నికల్లో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్న జనసేన.. తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో ఇరు పార్టీల అగ్ర నాయకులు తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. జనసేన తరఫున పవన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారంలోనూ పాల్గొనలేదు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రచారం చేయనుండటంతో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తన ప్రసంగాల్లో తెలంగాణ ఉద్యమాన్ని, నేతల పోరాటాన్ని విరివిగా ప్రస్తావించే పవన్.. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, తమ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారని జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి
Janasena Election Campaign in Telangana : మరోవైపు.. జనసేన పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాల్లో బీజేపీ(BJP), జనసేన నాయకులు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తమకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలోని పత్తి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 'వాక్ విత్ జనసేన' కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు, కోదాడ నియోజకవర్గాల్లోనూ బీజేపీ, జనసేన నాయకులు ఉమ్మడిగా ప్రచారం చేశారు. ప్రజలకు ఎన్నికల బ్యాలెట్‌పై ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి క్రమ సంఖ్యను ప్రజలకు వివరించారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ నాయకులు పాదయాత్ర చేశారు.
Pawan Kalyan's Janasena Exits From NDA : 'ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేనే చెబుతా'
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన - 8 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన