ETV Bharat / state

పెట్రోలింగ్​ వాహనంలో గర్భిణిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులు సకాలంలో స్పందించి తల్లీ బిడ్డను కాపాడారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భణిని పెట్రోలింగ్​ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉదారతను చాటుకున్నారు. ఈఘటన ఎస్​ఆర్​నగర్​ ఠాణా పరిధిలో జరిగింది.

Telangana news
హైదరాబాద్​ వార్తలు
author img

By

Published : Jun 4, 2021, 8:46 AM IST

బోరబండ రాజీవన్​నగర్​కు చెందిన స్వాతి(20)కి గురువారం రాత్రి 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బోరబండ బస్టాప్​ దగ్గరకు రాగా లాక్​డౌన్​ కారణంగా వాహనాలు ఏమీ లేవు. ఆ సమయంలో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులు వారికి సాయపడ్డారు.

మహిళను పెట్రోలింగ్​ వాహనంలో నిలోఫర్​ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేరడం వల్ల తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. కష్టకాలంలో ఆదుకున్న కానిస్టేబుల్​ సాయి ప్రసాద్​, హోంగార్డు శ్రావణ్​కు.. స్వాతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఉచిత బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.