Patnam Mahender Reddy As Cabinet Minister : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గులాబీ దళపతి ఒకే సారి 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఎన్నికల సైరన్ మోగించారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బెర్త్‌లు ఖారారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చోటు దక్కని వారికి మరో రూపంలో అవకాశం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కీలక నిర్ణయాల్లో భాగంగా... రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.
Telangana Cabinet Expansion 2023 : గురువారం రోజున మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆరోగ్యశాఖ మంత్రి(Telangana Health Minister)గా గురువారం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ ఖాళీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
BRS MLA Tickets Telangana 2023 : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట.. ఏడుగురు మహిళలకు ఛాన్స్
Health Ministry to Patnam Mahender Reddy : తాండూర్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ప్రకటించినందున గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన (KCR Medak Tour) దృష్ట్యా గురువారం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కి సమాచారం వెళ్లినట్లు తెలిసింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిపై.. కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో పైలట్ రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ఇరువురి నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇదే విషయమై పార్టీ అదిష్ఠానికి అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే పట్నం మహేందర్‌రెడ్డికి.. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని గులాబీ పార్టీ కట్టబెట్టింది.
అనంతరం కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న ఇరువురు ఇటీవలే మరోసారి ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పైలట్ రోహిత్‌రెడ్డికి (Pilot Rohit Reddy) బీఆర్ఎస్ టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి సేవలు అందిస్తోన్న మహేందర్ రెడ్డికి మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
BRS Party Campaign Strategy 2023 : హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ!
Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'