ETV Bharat / state

గాంధీ ఆస్పత్రికి పోతే గజగజ వణకాల్సిందే - గాంధీ ఆస్పత్రికి పోతే గజగజ వణకాల్సిందే

రాత్రి పూట గాంధీ ఆస్పత్రి ఆవరణలోకి వెళ్లి చూస్తే మనకు దర్శమిచ్చేవి... చుట్టూ కుక్కలు, దవాఖాన నిండా దోమలు, ఈగలు. వీటన్నిటి మధ్య రోగి సహాయకులు సేదదీరుతున్నారు. ఆస్పత్రిలో ఉండేందుకు స్థలం లేక, ఎక్కడికెళ్లాలో తెలీక వర్షంలో తడుస్తూనే... చెట్ల కింద నిద్రపోతున్నారు చాలామంది రోగుల తాలూకు బంధువులు.

గాంధీ ఆస్పత్రికి పోతే గజగజ వణకాల్సిందే
author img

By

Published : Jul 26, 2019, 4:07 PM IST

గాంధీ ఆస్పత్రికి పోతే గజగజ వణకాల్సిందే

రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాంధీ ఒకటి. నిత్యం వేలాది మంది రోగులు రాష్ట్ర నలుమూలల నుంచి చికిత్స కోసం ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. గాంధీ ఆసుపత్రిలో 1,050 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు 2,500ల మంది రోగులు చికిత్సకోసం వస్తుంటారు. నిత్యం వందలాది మంది రోగులకు ఇక్కడి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్సలను పూర్తిచేస్తారు. ఇక్కడ రోగాలు నయమవుతున్నా... వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకు, బంధువులకు మాత్రం కష్టాలు తప్పట్లేదు.

ఒక రోగితో పాటు ఒకరో ఇద్దరో బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆస్పత్రికి వచ్చి రోగి వద్ద ఉంటూ బాగోగులు చూసుకుంటారు. ఆస్పత్రిలో రోగితోపాటు ఉండేవారికి బస లేకపోవడం వల్ల వారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆసుపత్రిలోని మైదానంలో చెట్లకింద నిద్రించాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడం వల్ల ఎప్పుడు వర్షం పడ్తుందో తెలియని పరిస్థితి. ఇది చాలదన్నట్లు దోమలు, ఈగలు. వీటికి తోడు కుక్కలు. ఇన్ని సమస్యలున్నా చేసేదేం లేక వీటి మధ్యే నిద్రిస్తున్నారు రోగి బంధువులు.

పురుషులు ఎక్కడో ఓ చోటు పడుకున్నా... మహిళలు మాత్రం ఇక్కడ ఉండలేని పరిస్థితి. కనీసం శౌచాలయాలు కూడా లేకపోవడం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇక్కడకి వచ్చిన వారు చెబుతున్నారు. రోగులను చూసుకోవాల్సిన సమయంలో చిన్న చిన్న వాటి కోసం బయటకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇలాంటి వాటి వల్ల తమతో పాటు రోగులు ఇబ్బందులు పడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతటి ఘనమైన ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆందోళమకరమని రోగి తరఫు బంధువులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా రోగితో పాటు వచ్చిన వారికి బస, కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: 'మాయ మాటలు చెప్పి... నా కూతుర్ని ఎత్తుకెళ్లాడు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.