Pathapantala Jathara: రైతులకు ప్రజలకు చిరుధాన్యాల సాగు, వినియోగం అవశ్యకత తెలియజేసేందుకు దక్కన్ డెవలప్‌మెంట్ సోసైటీ గత 23 సంవత్సరాలుగా పాత పంటల జాతర నిర్వహిస్తోంది. విత్తనాలు.. మట్టే దైవంగా భావించి నిర్వహించే ఈ జాతరలో కులమతాలకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేశారు. సంచార జీవవైవిధ్య పండుగగా అంతర్జాతీయ స్థాయిలో ఈ జాతర గుర్తింపు దక్కించుకుంది.
నెల రోజులపాటు సాగిన ఈ చిరుధాన్యాల పండుగ.. ముంగింపు వేడుకలను మాచనూర్ నిర్వహించారు. ఇందులో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ రత్నావతి, ఫుడ్ అండ్ ట్రేడ్ పాలసి ఎనలిస్ట్ దేవిందర్ శర్మ.. ఐఐటీ ఖరగ్‌పూర్ ఆచార్యురాలు డాక్టర్ అర్చన పట్నాయక్‌తో పాటు పలువురు నిపుణులు అతిథులుగా పాల్గోన్నారు.
పాతపంటల సాగు వల్ల బహుల ప్రయోజనాలు ఉన్నాయని దక్కన్ డెవలప్‌మెంట్ సోసైటీ డైరెక్టర్ సతీష్ పేర్కోన్నారు. వర్షాభావ పరిస్థితులను సైతం ఈ పంటలు తట్టుకుంటాయని ఆయన తెలిపారు. వీటి సాగు వల్ల మనుషులకు పౌష్టికాహారం, పశువుల మేత లభించడంతో పాటు పర్యావరణ ప్రయోజనం సైతం కలుగుతుందని సతీష్ స్పష్టం చేశారు.
డీడీఎస్ రైతులు చిరుధాన్యాలు సాగు చేస్తూ తమతో పాటు సమాజాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని.. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరా రెడ్డి పేర్కోన్నారు.
దక్కన్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో మహిళా రైతులు ఉద్యమ తరహాలో చిరుధాన్యాలను సాగు చేస్తున్నారని ఫుడ్ అండ్ ట్రేడ్ పాలసి ఎనలిస్ట్ దేవిందర్ శర్మ పేర్కోన్నారు. జీ20 సదస్సులో చిరుధాన్యాలు, కలిపి పంటల సాగు అవశ్యకతపై చర్చించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ మారుమూల ప్రాంతంలోని మహిళలు చేస్తున్న వ్యవసాయం యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన అభినందించారు.
ఆహరంలో కేవలం వరి, గోధుమలను మాత్రమే ఆహారంగా తీసుకున్న వారు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోంటున్నారని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ రత్నావళి పేర్కోన్నారు. చిరుధాన్యాలతో అటుకులు, నూడుల్స్, పాస్తా వంటివి తయారీలో శిక్షణ ఇస్తామని రైతులకు ఆమె హమీ ఇచ్చారు.చిరుధాన్యాలు, సేంద్రీయ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
ఇక్కడి రైతుల సాగు విధానాలు, సేంద్రీయ మెలకువలు, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ వంటి అంశాలపై అవగాహన పెంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగులో విశేష కృషి చేసిన రైతులను అతిథులు ఘనంగా సన్మానించారు.
ఇవీ చదవండి: