ETV Bharat / state

Passport Services In Hyderabad : పాస్​పోర్ట్​ సేవలు మరింత చేరువ.. ఇక నుంచి తపాలా కార్యాలయాల్లోనూ - తపాలా కార్యాలయాల్లోనూ పాస్​పోర్టు సేవలు

Passport Services At Post Offices In Hyderabad : పాస్​పోర్ట్​ల రద్దీని అధిగమించేందుకు.. ఇక నుంచి హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్ట్ కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయాలు సేవలందించనున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.

passport
passport
author img

By

Published : May 23, 2023, 5:14 PM IST

Updated : May 25, 2023, 1:52 PM IST

Passport Services At Post Offices In Hyderabad : పాస్ ​పోర్టు సేవలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరింత చేరువ చేసింది. పాస్​పోర్ట్​కు పెరుగుతున్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని.. ఆ శాఖ చర్య చేపట్టిందని హైదరాబాద్ ప్రాంతీయ పాస్ ​పోర్ట్ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్ ​పోర్టు కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయాలలో పాస్​పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 20నుంచే ఆ తపాలా కార్యాలయాల్లో.. తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల నుంచి వస్తున్న అధిక పాస్​పోర్ట్ డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. తపాలా కార్యాలయాలు పాస్​ పోర్టు సేవలను అందిస్తాయని ఆయన ప్రకటించారు.

ఇందుకు ప్రతి బుధవారం సాయంత్రం 4 గంట నుంచి 4.30 గంటల మధ్యలో 700 సాధారణ అపాయింట్​మెంట్లు ఇస్తామని పాస్​పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. ప్రతి రోజు అపాయింట్​మెంట్​లలో 10 నుంచి 15 శాతం కొన్ని కారణాలతో తిరస్కరణకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాలు ఇతర దరఖాస్తు దారునికి ఇబ్బందిగా మారుతోందని ఆందోళన చెందారు. అపాయింట్​మెంట్​ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అపాయింట్​మెంట్ల కోసం దరఖాస్తుదారులు వేచి చూడకుండా త్వరితగతిన సేవలు అందిస్తామని భావించారు. ఇప్పటి వరకు ఉద్యోగ, విద్య, మెడికల్ అవసరాలకు సంబంధించిన పత్రాలు కలిగిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ నెల 15 నుంచి 30 వరకు అదనంగా 7150 అపాయింట్​మెంట్లు : పాస్​ పోర్టుల కోసం అధికంగా దరఖాస్తులు వస్తుండడంతో అపాయింట్​మెంట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. ఈ రద్దీని అధిగమించేందుకు రోజు వారీ అపాయింట్​మెంట్లకు అదనంగా మరో 500 అపాయింట్​మెంట్లు ఇవ్వడం ద్వారా.. డిమాండ్​ను తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 12 వరకు 5500 అపాయింట్​మెంట్లు అదనంగా ఇచ్చినట్లు ప్రాంతీయ పాస్ ​పోర్టు అధికారి తెలిపారు. మళ్లీ ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరో 7150 అపాయింట్​మెంట్లను అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచన మేరకు హైదరాబాద్ పాస్ ​పోర్టు ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలో ఉన్న 14 తపాలా కార్యాలయాలలో అపాయింట్​ మెంట్లను తీసుకోవచ్చు.

ఇవీ చదవండి :

Last Updated : May 25, 2023, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.