దసరా పండుగ దృష్ట్యా హైదరాబాద్లోని బస్టాండ్లలో సందడి నెలకొంది. నిన్న మొన్నటి వరకు కొద్దిమంది ప్రయాణికులతో అరకొరగా తిరిగిన బస్సులు ఇప్పుడు జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. కొవిడ్ వ్యాప్తి కారణంతో ఎవరి ఇళ్లకు వారే పరిమితమైన వారు ఇప్పుడు పండుగ రాకతో సొంతూళ్లకు పయనమవుతున్నారు.
ఈ సమయంలో బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో రద్దీతో కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశం లేకపోలేదు. మాస్కులు ధరించి ప్రయాణించినా కనీస జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించకపోతే మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయి. నగరంలోని ఉప్పల్ బస్టాండ్లో తాజా పరిస్థితులు చూస్తే కొవిడ్ పట్ల జనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది.
ఇదీ చదవండి: ఇది రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయం: ఉత్తమ్