శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాల కోసం కొన్ని గంటలుగా లాంజ్‌లోనే పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు.... పలు సర్వీసులను అర్ధాంతరంగా రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్టి నుంచి దేశీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభం కావడం వల్ల.... వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఎయిరిండియా అధికారులు... సరిపడా ప్రయాణీకులు లేక పలు విమాన సర్వీసులు నిలిపివేయడం సహా పలు మార్గాల్లో సర్వీసులను రద్దుచేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమాన సర్వీసుల్లో మార్పులు చేయడం పట్ల ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్‌కు 100కి పైగా విమాన రాకపోకలు సాగించాల్సి ఉందని... ఇవాళ 30 విమానాలు మాత్రమే రాకపోకలు సాగే అవకాశముందని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎస్, రంగారెడ్డి కలెక్టర్ చేరుకున్నారు. విమానాశ్రయం అరైవల్ మార్గాన్ని సోమేశ్‌కుమార్, అమోయ్‌కుమార్ పరిశీలించారు.
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు