ETV Bharat / state

బాబ్బాబు ఒక్కసారి ఊరొచ్చి నాకు ఓటేసిపో - రానుపోను ఖర్చులన్నీ నావే

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 12:01 PM IST

Parties Focus on Migrant Voters in Telangana : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. గెలుపు కోసం పార్టీలు పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటు కీలకమే. అందుకే పార్టీలు నియోజకవర్గాల్లోని ఓట్లే కాకుండా.. వలస ఓట్లపై ఫోకస్ పెట్టాయి. వారిని గుర్తించి.. కలుసుకునే పనిలోపడ్డాయి. ఎందుకంటే గెలుపు, ఓటముల్లో ఈ ఓట్లే కీలకం కానున్నాయి. ఇందుకోసం నేతలు ఎలాగైనా వారిని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు.

Telangana Assembly Elections 2023
Parties Focus on Migrant Voters

Parties Focus on Migrant Voters in Telangana : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఓటర్ల చేతిలోనే అభ్యర్థుల రాజకీయ భవిష్యత్​, తలరాత ఆధారపడి ఉంటుంది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని వారికి తెలుసు. అందుకే ఓవైపు నియోజకవర్గాల్లో ఓట్లు అభ్యర్థిస్తూనే.. మరోవైపు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను (Migrant Voters) కనిపెట్టి.. పోలింగ్​ రోజున తీసుకొచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

Telangana Assembly Elections 2023 : ఇందులో భాగంగా పొట్ట చేత పట్టుకుని, సొంతూళ్లను వదిలిపోయిన వారిని బాబ్బాబు.. ఒక్కసారి ఊరికి వచ్చిపో. నీ ఓటు నాకు వేసిపో.. అంటూ రాజకీయ పార్టీల నాయకులు ప్రాధేయపడుతున్నారు. సోలాపూర్‌, ముంబయి, పుణె వెళ్లి మరీ అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనోపాధి పొందుతున్న వారి రాక కోసం.. పెద్దఎత్తున ఆశలు పెట్టుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో వలస ఓటర్లు ఉండటమే ఇందుకు కారణం.

తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటే కీలకం

Political Leaders Concentrated on Migrant Voters : ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకంగా, మరో 15 చోట్ల పాక్షికంగా వలస ఓటర్లు ప్రభావం చూపుతారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. వీరి కుటుంబాలకు సొంత గ్రామాల్లో ఆస్తిపాస్తులు ఉండటంతో.. సమాచారాన్ని సేకరిస్తున్న నేతలు.. వారిని రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఓట్లు మీవి.. ఖర్చులు మావి : డీసీఎంలు, రైళ్లు, బస్సులు ఇలా.. మీరు ఎలా వస్తామంటే అలా.. ఏర్పాట్లు చేస్తామని వలస ఓటర్లను నేతలు కోరుతున్నారు. రానూపోనూ ఖర్చులనూ చెల్లిస్తామని చెబుతున్నారు. పోలింగ్‌ నాడు (Telangana Assembly Elections 2023) వచ్చి, ఓటేసిపోవాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో బస్సుల్లో వస్తే ఒక్కొక్కరికి రూ.1500 వరకు ఖర్చు అవుతుందని.. ప్రత్యేకంగా డీసీఎంలు, లారీలు అద్దెకు తీసుకుంటే కొంత తక్కువ ఖర్చు అవుతుందని వారు లెక్కించారు. అందుకే అంత మొత్తం వారికి చెల్లించేలా నాయకులు ఒప్పందాలు చేసుకుంటున్నారు.

హైదరాబాద్​ షెహర్​పై పట్టు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు - ఓటర్ల మనసు గెలిచేదెవరో? జెండా పాతేదెవరో?

మహబూబ్‌నగర్‌, వనపర్తి, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాలకు చెందిన కొన్ని ప్రధాన పార్టీల నేతలు.. ఇటీవల మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో కూలీలుగా పని చేస్తున్న వారిని సంప్రదించారు. వారిని ఒప్పించడంలో కూలీలను నియంత్రించే గుంపు, ముఠా మేస్త్రీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడంగల్‌ ప్రాంతానికి చెందిన వారు ముంబయి నుంచి వచ్చేందుకు ఐదు బస్సులను అద్దెకు మాట్లాడుకున్నారు.

కంపెనీల యజమానులతో మాట్లాడి : తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ప్రైవేటు ఉద్యోగులు, కూలీలు హైదరాబాద్‌ నగరంతో పాటు శివారుల్లోని పరిశ్రమలు, వివిధ కంపెనీల్లో పని చేస్తున్నారు. వీరిపైనా పార్టీలు దృష్టి సారించాయి. జంట నగరాల్లో వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని నియోజకవర్గాలకు తీసుకెళ్లేందుకు పలువురు అభ్యర్థులు.. ఆయా పరిశ్రమలు, కంపెనీల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

  • ఎల్బీనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న కూలీలతో.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు నేతలు పలు దఫాలుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులూ తాజాగా భేటీ అయ్యారు.
  • గత ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో 5,000ల కంటే తక్కువ ఓట్ల తేడాతో కొందరు ఓటమి చెందారు. మరికొన్నిచోట్ల మూడో అభ్యర్థి కారణంగా ఓటమి పాలయ్యారు. ఇలాంటి పరిస్థితులను ఈసారి ఎలాగైనా అధిగమించడానికి పలువురు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వలస కూలీల ఓట్లకు గాలం వేసేందుకు చెమటోడ్చుతున్నారు.

చట్టసభలో మహిళలకు దక్కని అవకాశం - తెలంగాణ ఎన్నికలో మహిళలకు ఎన్ని సీట్లో తెలుసా?

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

'మా భవిష్యత్‌కు భరోసా ఇచ్చే నాయకుడికే ఓటేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.