రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కానీ పలు జిల్లాల్లో పాక్షికంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. పోలీసుల భద్రత నడుమ డిపోల నుంచి ఆర్టీసీ, అద్దె బస్సులు బయటకు వెళ్తున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను అధికారులు నడుపుతున్నారు. రోజువారీ వేతనంపై తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు నియమిస్తున్నారు. తాత్కాలిక సిబ్బందిగా పనిచేసేందుకు పలు డిపోలకు ప్రైవేట్ డ్రైవర్లు భారీగా తరలివస్తున్నారు. వారికి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా డిపోల నుంచి ఆర్టీసీ, అద్దె బస్సులు రోడ్డెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా బస్సులు నడుస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 92 బస్సులు... సంగారెడ్డి డిపో నుంచి 50 శాతం బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె