లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో - ఎన్నికల లెక్కింపు ప్రక్రియ
ఈనెల 27న జరిగే ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని జడ్పీ సీఈవో రవి పరిశీలించారు. పటాన్చెరులోని ఆర్ఆర్ఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో దీనికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు.
లెక్కింపు కేంద్రం పరిశీలన
పటాన్చెరు నియోజక వర్గ పరిధిలోని ముత్తంగి ఆర్ఆర్ఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సంగారెడ్డి జడ్పీ సీఈవో రవి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 27న జరిగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అనువుగా ఉండే గదులను గుర్తించారు. జిన్నారం, అమీన్పూర్ మండలాలకు ఒక గది చొప్పున కేటాయించగా... ఎక్కువ మంది అభ్యర్థులున్న పటాన్చెరు మండలానికి రెండు గదులను కేటాయించారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈవో తెలిపారు.
ఇదీ చూడండి : 'స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి'
Intro:కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో నిత్య జనగణమన నూట పదవ రోజున పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి హాజరై జండా వందనం చేశారు. సామాజిక రుగ్మతలు అధిగమించిన నాడే దేశం పటిష్టంగా మారుతుందన్నారు. కేవలం జెండా వందనంతో సరిపెట్టుకోకుండా దేశభక్తిని చాటే కార్యక్రమాలు యువత చేపట్టాలని సూచించారు. కులమతాలకు అతీతంగా దేశ పౌరులంతా ముందు భారతీయులమని స్పష్టం చేశారు.
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632
Last Updated : May 16, 2019, 6:38 AM IST