ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 46 అమలు చేసి ట్యూషన్ ఫీజు తగ్గించాలని సికింద్రాబాద్ గీతాంజలి దేవశాల స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా పాఠశాల ప్రధాన రోడ్డు నుంచి బలం రాయ్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు.
ఎంతవరకు సమంజసం
ఈ నిరసనలో.. జీవో 46 అమలు చేసి ట్యూషన్ ఫీజు తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు పాఠశాల తెరుచుకోకున్నా.. స్కూల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో ఫీజు కట్టాలంటూ వేధించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
న్యాయం చేయండి
ఈ విద్యాసంవత్సరం ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫీజు పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అధికార యంత్రాంగం చొరవ తీసుకొని వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
'లాక్ డౌన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ స్కూలు తెరుచుకోలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించమంటున్నారు. అధికార యంత్రాంగం ఈ విషయమై చొరవ తీసుకుని న్యాయం చేయాలి.'
---రాజేష్, విద్యార్థి తండ్రి
ఇదీ చదవండి:ఫిబ్రవరి నుంచి పాఠశాలల పునః ప్రారంభం.. వారికి మాత్రమే!