ETV Bharat / state

parents for missing son: 'పదేళ్లుగా బిడ్డ జాడలేదు.. తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు' - missing boy in hyderabad

parents for missing son: ఏ తల్లికైనా బిడ్డ కాసేపు కనిపించకపోతే ఆమె పడే ఆరాటం అంతా ఇంతా కాదు. పిల్లలు బడికివెళ్లినా బజారుకు వెళ్లినా వారు తిరిగొచ్చే వరకు కన్నవారు కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తుంటారు. అలాంటిది, వారు ఎక్కడైనా తప్పిపోతే ఆ కన్నపేగు తల్లడిల్లుతుంది. ఏళ్లు గడుస్తున్నా బిడ్డ తిరిగిరాకపోతే అంతకుమించిన యాతన ఆ తల్లిదండ్రులకు ఇంకోటి ఉండదేమో. పదేళ్ల క్రితం బుడిబుడి అడుగులతో బడికి వెళ్లిన కుమారుడి కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తోంది... ఓ తల్లి.

parents for missing son
కొడుకు కోసం విలపిస్తున్న అమ్మ
author img

By

Published : Apr 14, 2022, 3:50 PM IST

'పదేళ్లుగా బిడ్డ జాడలేదు.. తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు'

parents for missing son: బిడ్డ కోసం ఎదురుచూసి ఆ కళ్లు అలసిపోయాయి. ఏళ్ల తరబడిగా ఏడ్చి ఆ తల్లి కన్నీరే ఇంకిపోయింది. వెతకని చోటు లేదు. తిరగని కార్యాలయం లేదు. కనిపించని కన్నపేగు కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూశారు. అయినా ఆఫీసుల్లో అధికారులు మారారే తప్పిస్తే కుమారుడి జాడ కనిపెట్టిన వారు మాత్రం ఒక్కరూ లేరు. ప్రకాశం జిల్లా మాటూరు గ్రామానికి చెందిన నరేష్, వనజ దంపతులు 2012లో బతుకుదెరువు కోసం హైదరాబాద్​కు వచ్చి శంషాబాద్​లో జీవనం సాగిస్తున్నారు.

అప్పటికే నాలుగేళ్ల వయసున్న కుమారుడు సంతోష్ కుమార్, కుమార్తె సంజన ఉండగా... వీరిని స్థానికంగా ఉన్న పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలోనే 2013లో ఓ పాఠశాలకు వెళ్తుండగా బాబు తప్పిపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే శంషాబాద్ ​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్​కు గురైనట్లు ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిర్లక్ష్య సమాధానాలిస్తూ కేసును పక్కన పెట్టినట్లు వారు వాపోతున్నారు.

ఈ పదేళ్ల కాలంలో ఎన్నోసార్లు పోలీస్​స్టేషన్​కు వెళ్లినా అధికారులు మారారు తప్పిస్తే, తమ బిడ్డ జాడ కనిపెట్టేందుకు కనీస ప్రయత్నం చేయలేదని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరొచ్చిన ఆ దంపతులకు బిడ్డ తప్పిపోవటం తీరని వేదనను మిగిల్చింది.

పదేళ్లుగా బిడ్డ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ దంపతులు చేసేదేం లేక మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించాం. స్పందించిన హెచ్​ఆర్సీ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికైనా ఈ విషయంలో పోలీసులు స్పందించి మాకు న్యాయం చేయాలి. సంతోష్ కుమార్ తల్లిదండ్రులు

ఇదీ చదవండి: ప్రశాంతంగా ప్రాణహిత పుష్కర వేడుక.. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తజనం

ఈ ఏడాది సాధారణ వర్షపాతమే.. దక్షిణాదిన మాత్రం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.